మన హీరోలు జీరోలా ?

 

 

 

సినిమాలో మన హీరోలు ఎడమ చేత్తో వంద మందిని తంతారు. ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా వీరంగాలు వేస్తారు. అన్యాయాల్ని, అక్రమాల్ని అసలు సహించారు. ప్రపంచంలో ఎవరికీ లేనంత ఆత్మాభిమానం కూడా వారికి వుంటుంది.


మరి నిజ జీవితంలో  సీమాంద్ర ప్రజలకు అన్యాయం జరిగేలా హైదరాబాద్ తో సహా ప్రత్యేక తెలంగాణా ప్రకటన ఢిల్లీ పెద్దలు చేసి వారం రోజులు దాటినా, ఒక్కరు కూడా స్పందించలేదు. నిజానికి మన హీరోలంతా సీమాంద్ర కి చెందిన వారే. మరి వాళ్ళు  ఢిల్లీ పెద్దల చర్యని ఎందుకు ఖండించలేదు? వాళ్ళ హీరోయిజమంతా సినిమాలా వరకేనా ? నిజ జీవితంలో వాళ్ళు జీరోలేనా ?
 
   

కచ్చితంగా జీరోలే !!


తెరమీద రచయితలు రాసిన పవరఫుల్ డైలాగులు వల్లిస్తూ వాళ్ళ డూప్ లతో ఫైట్స్ చేయిస్తారు.. వీళ్ళు ఒట్టోట్టి ఫైట్స్ చేస్తారు. అది చూసి వాళ్ళ పిచ్చి అభిమానులు వారిని వెర్రిగా అభిమానిస్తారు. వాళ్ళ కటౌట్ లకి పూల దండలతో, పాలాభిషేకాలు ! ఎనిమిది రోజులుగా ఒక్క మాట మాట్లాడని వారికి అంతా అర్హత ఉందా ? తెలంగాణా గురించి మాట్లాడితే వాళ్ళ సినిమాలు ఆడనివ్వారని భయమా ? వాళ్ళని  ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడక పోతే జనం ఎలాగూ వాళ్ళ సినిమాలు ఆడనివ్వరు.


నిజానికి మన హీరోలకంటే రజనీకాంత్, సూర్య, విక్రం లాంటి తమిళ హీరోలకే మన ఆంధ్రాలో ఎక్కువ క్రేజ్ వుంది. ఇంకా మేము గొప్ప హీరోలం అనుకుంటే అది వారి భ్రమ మాత్రమే.


మన నిర్మాతలూ ఏం తీసిపోలేదు. ఒకవేళ తెలంగాణా నేతలు పొమ్మంటే " ఓ... అలాగే... మేం విశాఖపట్నం పోయి స్టూడియోలు  నిర్మించుకుంటాం" అంటూ చీము, నెత్తురూ లేని వాళ్ళలా వ్యాఖ్యలు చేస్తారు. దేశంలో అతి పెద్దదైన మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఒక్కళ్ళూ పెదవి విప్పకపోవడం  సిగ్గులేని తనం.