చింతమనేనికి అవమానం... నడిరోడ్డుపైనే కారు


ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రులు వంటి ప్రజాప్రతినిధులకు టోల్ గేట్ రుసుం మినహాయింపు ఉంటుంది. కానీ... చింతమనేని తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్న కారును గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది వదిలిపెట్టలేదు. సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే చింతమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తన కారును అక్కడే వదిలేసి బస్సు ఎక్కి  సైలెంట్ గా వెళ్లిపోయారు. ఏ చిన్న విషయంలోనైయినా తనకు అడ్డు వస్తే దేవుడనైయినా ఎదిరించే దమ్మున్న చింతమనేని టోల్ గేట్ నుంచి సైలెంట్‌గా వెళ్ళడాన్ని చూసిన ప్రజలు షాక్‌కి గురైయినారు. అంతే కాకుండా అసలు ఆ టోల్ గేట్ సిబ్బంది చింతమనేని కారును వదలకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.