అట్టర్ ప్లాప్.. జగన్ కాపీ కొట్టిన మూడు రాజధానుల ఫార్ములా ఫెయిల్!

సౌతాఫ్రికా మోడల్ కాపీకొట్టి ఏపీ లో మూడు రాజధానులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కారు పై ఎన్నారైలు మండిపడుతున్నారు. ప్రజలని మభ్యపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగు వారంతా ఓ చోట పోగై అక్కడ అమలవుతున్న మూడు రాజధానులతో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుందో చెప్పుకొచ్చారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఏపీని మార్చొద్దని సూచించారు. జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సౌతాఫ్రికాలో ఈ రకంగా నిరసన వ్యక్తం చేశారు.

సౌతాఫ్రికాలో ప్రిటోరియా, కెప్టెన్, బ్లూంఫౌంటేన్ నగరాలు క్యాప్టల్ గా ఉన్నట్లే ఏపికి కూడా మూడు రాజధానులు చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. అడ్మినిస్ర్టేటివ్ క్యాపిటల్ గా ఉన్న ప్రిటోరియాలో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగుల కార్యాలయాలు ఉండగా లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉన్న కెప్ టౌన్ లో చట్ట సభలు మాత్రమే ఉన్నాయి. ఇక జుడీషియల్ క్యాపిటల్ గా బ్లోమ్ ఫౌంటెన్ లో సుప్రీంకోర్టు ఉంది. సేమ్ మక్కీ టూ మక్కీ ఇదే ఫార్ములాను సీఎం జగన్ కాపీ కొట్టింది. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి కేంద్రంగా లెజిస్టేటివ్ క్యాప్టిల్, కర్నూల్ కేంద్రంగా జుడిషియల్ క్యాప్టిల్ మార్చేలా బిల్లు తీసుకొచ్చారు. ఈ చెత్త ఫార్ములాతో సౌతాఫ్రికా చాలా నష్టపోయిందని ఖర్చులు తడిసి మోపడవడంతో ప్రగతి మందగించిందని ఆదేశా నాయకులే నెత్తీ నోరూ బాదుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పుడు సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగువాళ్లు కూడా గుర్తు చేస్తున్నారు. త్రీ క్యాప్టల్స్ ఫార్ములా అట్టర్ ఫ్లాప్ అయిన దేశం నుంచే తమ గొంతుక వినిపిస్తున్నారు. సౌతాఫ్రికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్లంతా ఓ చోట పోగై సెమినార్ నిర్వహించారు. జగన్ సర్కార్ కు కనువిప్పు కావాలని నినాదించారు. అమరావతి నిర్మాణానికి డిజైన్ ఇచ్చిన సింగపూర్ కన్సాల్టియం ఇచ్చిన డిజైన్ తోనే చైనాలో ఓ సిటీ కడితే ఏకంగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.