హరీష్‌రావుపై వెల్లువెత్తిన అభిమానం!!

 

టీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద సందడి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన టీఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌ హరీష్ రావుకు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలింది. వందలాది వాహనాల్లో ఆయన అభిమానులు, అనుచరులు తరలిరావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. అయితే టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్‌ నియమితులైన నేపథ్యంలో హరీష్‌ రావు అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.