జగన్ పై 31... చంద్రబాబుపై ఒకే ఒక్కటి... క్రిమినల్ కేసుల్లో వైసీపీ టాప్.!

సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీలన్నీ తమ అభ్యర్ధులపై ఉన్న కేసుల వివరాలను బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్ధుల క్రిమినల్ రికార్డును తమతమ పార్టీ వెబ్ సైట్స్ లో పెట్టేందుకు వివరాలు సిద్ధం చేస్తున్నాయి. అయితే, వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో మొత్తం 86మందిపై కేసులున్నట్లు చెబుతున్నారు. ఇక, టీడీపీ ప్రజాప్రతినిధుల్లో 15మందిపై కేసులున్నట్లు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అత్యధికంగా 31 కేసులు ఉండగా.... అందరి కంటే అతి తక్కువగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష లీడర్ చంద్రబాబుపై ఒకే ఒక్క కేసు ఉన్నట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం మేరకు వైసీపీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఏపీ ముఖ్యమంత్రి) - 31 కేసులు, కన్నబాబు(వ్యవసాయశాఖ మంత్రి) - 3 కేసులు, కొడాలి నాని ( సివిల్ సప్లై మంత్రి) -  4 కేసులు, పేర్ని నాని(I&PR మంత్రి) - 2 కేసులు, అనిల్ కుమార్ (ఇరిగేషన్ మంత్రి) -  కేసులు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(ఆర్థిక శాఖ మంత్రి) - 2 కేసులు, సురేష్ (విద్యాశాఖ మంత్రి) - 2 కేసులు, గౌతమ్ రెడ్డి(పరిశ్రమల శాఖ మంత్రి) - 3 కేసులు, శంకర నారాయణ (బీసీ సంక్షేమ శాఖ మంత్రి) - 6 కేసులు,  వెల్లంపల్లి శ్రీనివాస్ రావు (దేవాదాయశాఖ మంత్రి) - 2 కేసులు, మోపిదేవి వెంకటరమణ (పశుసంవర్ధక శాఖ మంత్రి) - 2 కేసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి (అటవీశాఖ మంత్రి) -   2 కేసులు, అంజద్ బాషా (ఉప ముఖ్యమంత్రి) - 3 కేసులు, గోరంట్ల  మాధవ్ (ఎంపీ) - 2 కేసులు, విజయ్ సాయి రెడ్డి(ఎంపీ) - 13 కేసులు, చంద్ర శేఖర్(ఎంపీ) - 4 కేసులు, MVV సత్యనారాయణ(ఎంపీ) - 1 కేసు, రంగయ్య(ఎంపీ) - 1 కేసు, అవినాష్ రెడ్డి(ఎంపీ) - 4 కేసులు, బలశౌరి(ఎంపీ) - 2 కేసులు, బ్రహ్మానందరెడ్డి(ఎంపీ) - 1 కేసు, రఘురామకృష్ణంరాజు(ఎంపీ) - 6 కేసులు, భరత్ (ఎంపీ) - 2 కేసులు, మిథున్ రెడ్డి (ఎంపీ) - 3 కేసులు, ధర్మాన ప్రసాదరావు(     ఎమ్మెల్యే) - 2 కేసులు, దాడిశెట్టి రాజా ( ఎమ్మెల్యే) - 15 కేసులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, ఏమేం కేసులు ఉన్నాయో... తమతమ పార్టీ వెబ్ సైట్లలో ఆయా పార్టీలు పెట్టాకే ఫుల్ క్లారిటీ రానుంది.