విభజన కోస్తా ఆంధ్ర, రాయలసీమకు శరాఘాతం !

 
తరచూ తెలంగాణా తమ్ముళ్ళు ,నాయకులూ అంటుంటారు .ఆంధ్ర వారు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణా ఏర్పాటుకు మార్గం సులభ తరం చేయాలి అని . ఇప్పుడు కాంగ్రెస్ ఉద్దేశం ప్రకారం  తమ్ముడికి  అత్యాశ కలిగిన గడుసరి పెళ్ళాం(ఉద్యమాలు ) వుండడం వల్ల అన్న ఆస్తులన్నీతమ్ముడికి జాలిపడి  ఇచ్చేసి బికారి అయ్యి సన్యాసి అయి అడువులకు పోవలన్నట్లు వుంటుంది .
"ఆనాడు  లక్ష్మణుడు అన్నకోసం భార్యను రాజ్యాన్ని వదిలి అడివి కి వెళ్ళాడు .
 ఈ నాటి  తమ్ముడు అన్నను కట్టు బట్టలతో తరిమేస్తున్నాడు . 
నోరు మంచిదైతే వూరు మంచిది అనే నానుడి పోయి
నోరున్న వాడిదే రాజ్యం అన్నట్లు ఈ విభజన నిర్ణయం బాధేస్తుంది" . 

ఉమ్మడి రెక్కల కష్టం తో హైదరబాద్ ను నిర్మిస్తే హైదరబాద్ మాది అని అనడం ఎంత భావ్యమో చెప్పాలి . అది తెలంగాణా కు మాత్రం సొంతం అంటే ఎలా !.
మీరు నిజంగా హైదరబాద్ 1956 నుంచి ఏమి మారలేదు అంటే ఆప్పటి నుంచి వున్నా  ఆస్తులు ఉమ్మడి ఆస్తులు గా ప్రకటించండి. అవి రెండు రాష్ట్రాలకు చెండుతాయీ . ... ఏమి మాటలు రావడం లేదా...  గొంతు పెగలడం లేదా ఏమి న్యాయము ఇది !.

సోదరా సోదరుల్లాగా విడిపోతాము అని చెపుతూ మీరు మీ భార్య  పిల్లలు ఆంధ్ర కు పోయి అడుక్కోండి అన్నట్లు వున్నది .
మీ ఆంధ్ర నాయకులూ,వ్యాపార వేత్తలు ,పెట్టుబడి దారులు , దొంగలు, దోపిడీ దారులు ,రక్త పిపాసులు. మీరు నిర్మించిన హైటెక్ సిటీ పిచ్చుకుల గూడు, మీ రచయతలు సాహిత్యం తెలియదు ,మీ ఆంధ్ర  గోంగూర పెడ లాగా వుంటుంది ,మీ బ్రాహ్మణులకు మంత్రాలూ రావు , మీ తెలుగు తల్లి పనికిరాని పిచ్చీ తల్లి . ఆంధ్ర ప్రజలు మంచోళ్ళు  అయినా కాని వాళ్ళు హైదరబాద్ వదిలి వెళ్ళాల్సిందే .. ... 
ఇది మన తెలంగాణ నాయకులు చెప్పే కథలు ,వినిపించే నీతులు  మనసు లేని, హృదయం లేని కర్కో టకపు  మూర్కపు పిడి  వాదనలు. 

ఇప్పుడు  వీరికి నిజాం నవాబు గొప్ప నాయకుడు,రజాకార్లు దేశభక్తులు. మావో ఇష్టు తరహాలో నూతన  తెలంగాణా ప్రభుత్వమట !
మీరు రాజకీయ నాయకుల్లో,పెట్టుబడి దారుల్లో  మంచి ,చెడు లేని వారిని ప్రాంతాల వారి గా  చూపించాగలరా !.
వెయ్యి అబద్ధాలతో తెలంగాణా ప్రజలను అవి నిజాలుగా నమ్మించడం లో  వేర్పాటు వాదులు తాత్కాలిక విజయం సాధించారు .
గాంధీ గారి గ్రామ స్వరాజ్యం,స్వతంత్రం  పోయి ,ఒకే చోట అధికారాలు ,వసతులు ,ఉద్యోగాలు ,పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు
మనకు ఈ పరిస్థితి వచ్చింది . 
మన రేపటి ఆంధ్ర పరిస్థితి నీళ్ళు ఉండవు ,ప్రభుత్వ ,ప్రైవేటు ఉద్యోగాలు దొరకవు ,విమానాశ్రయాలు లేవు ,రవాణ సౌకర్యాలు అంతంత మాత్రమే ,కనీసం చెప్పుకో దగ్గ ట్రైన్లు లేవు .

ఎట్లా చూసిన నష్టమే !.  


కలసి వుండడం నిజంగా  సాధ్యం కాకపోతే హైదరబాద్ నగరం ను స్వయం ప్రతి పత్తి కల రాష్ట్రము లాగా ,UT స్టేట్ ,లేదా రాజ్యాంగ పిత  Dr BR అంబేద్కర్ చెప్పినట్లు  రెండవ రాజధానిగా హైదరబాద్  ఏర్పడాల్చిందే !. దీని వల్ల  ఉభయ ప్రాంతాలకు సమాన  న్యాయం జరుగుతుంది . అన్ని ప్రాంతాలు మెల్ల మెల్లగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయీ!. ఇప్పుడే మన హక్కులు నయానో భయానో సాధించుకోవాలి !. మొహమాటానికి ,భేషజాలకు ,మర్యాద ల కు పొతే
మనకు మిగిలేది మట్టే  (బొగ్గు కూడా తెలంగాణా లోనే వుంది )  .