కిడ్నీ బాధితులకు పది వేల పెన్షన్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన కిడ్నీ బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని జీజీహెచ్ లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న రోగులకు చెక్కులు పంపిణీ  చేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. కిడ్నీ మార్పిడి చేసుకున్న బాధితులకు పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు కిడ్నీ మార్పిడి చేయించుకున్న బాధితులు ప్లకార్డులు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు బాధితులను అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న బాధితను అరెస్టు చేసి అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత బాధితులను పోలీసులు వదిలేశారు.

డయాలసిస్ చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారిని కూడా పెన్షన్ లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.కేవలం డయాలసిస్ చేయించుకున్న వారికి మాత్రమే పెన్షన్  ఇస్తే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వెంటనే విధుల్లోకి వెళ్లలేమని.. నిత్యావసరాలకు సైతం ఇబ్బంది పడుతున్నారన్నారు. అంతే కాక కేవలం తమ మందులకు నెలకు పది వేలు ఖర్చు అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వమే తమ పై జాలి చూపాలని తెలిపారు. తమను కూడా పెన్షన్ లిస్ట్ లో జోడించాలని కొందరు కిడ్నీ మార్పిడి బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు.