తెలంగాణలో పోలింగ్ పూర్తి

 

 

 

తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ పూర్తయింది. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. చిన్న చిన్న చెదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ప్రారంభంలో పోలింగ్ మందకొడిగా జరిగినా 10 గంటల తర్వాత పోలింగ్ సరళి పెరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా 74 నుంచి 78 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. జిల్లాల వారీగా పోలింగ్ శాతాల వివరాలు ఇలా వున్నాయి. పూర్తి వివరాలు వచ్చిన తరువాత ఈ శాతాలలో కొంత మార్పు వచ్చే అవకాశం వుంది.

 

హైదరాబాద్ – 58శాతం, రంగారెడ్డి –  61శాతం, ఆదిలాబాద్ –  78శాతం, నిజామాబాద్ –  70శాతం, మెదక్ –  77శాతం, కరీంనగర్ –  76శాతం, వరంగల్- 75శాతం, మహబూబ్ నగర్  -  73శాతం, నల్గొండ –  81శాతం,  ఖమ్మం – 78 శాతం.