కారు జోరు.. మునిసిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ హవా  కొనసాగుతుంది. టీఆర్ఎస్ ఖాతాలో ఇప్పటికే పరకాల, చెన్నూరు, సిరిసిల్ల అలాగే బొల్లారం, హుజూర్ నగర్, జవహర్ నగర్ టీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. ఇక హుజూర్ నగర్ మున్సిపాలిటీ అయితే టీఆర్ఎస్ కైవసం చేసుకోగలిగింది. ఆదిభట్లలో రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందులో రెండవ వార్డుల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. శంషాబాద్ లో మూడు వార్డుల్లో టీఆర్ఎస్ ముందజలో ఉంది. ధర్మపురిలో రెండవ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. బొల్లారంలో 16,17,18 వార్డులో టిఆర్ఎస్ విజయం సాధించింది. మీర్ పేట్ లోని రెండు వార్డుల్లో కూడా టీఆర్ఎస్ , మీర్ పేటలోని ఒక వార్డులో బిజెపి గెలిచినట్టుగా ప్రకటించడంతో ఇప్పటి వరకు అధికారికంగా బిజెపి ఖాతాలో విజయం చేరినట్లుగా తెలుస్తుంది. అలాగే తుక్కుగూడలో 6వ వార్డులో కూడా బీజేపీ గెలుపొందింది. ఇక వైరాలోని 7 వ వార్డులో టిఆర్ఎస్ విజయం సాధించింది. రామాయంపేటలో ఉన్న 7వ వార్డు కూడా టీఆర్ఎస్ ఖాతాలో చేరింది.  

సీపిఎస్ ఇచ్చిన ఒక సర్వేలో చాలా స్పష్టంగా టీఆర్ఎస్ కే పూర్తి ఫలితం అనుకూలంగా ఉండబోతోందనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సీపిఎస్ సర్వే అంచనా ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో.. 104 నుంచి 109 స్థానాల్లో టిఆర్ఎస్ గెలిచే ఆస్కారం ఉందని చెప్పి సీపిఎస్ తన అంచనాలని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సున్నా నుంచి నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఆ సర్వేలో వెల్లడించారు. ఇక బీజేపీ రెండు స్థానాలు గెలిచే ఆస్కారం ఉంది. అలాగే ఎంఐఎం ఒకటి నుంచి రెండు చోట్ల విజయం సాధించవచ్చని సీపిఎస్ సర్వే వెల్లడించింది.