తెలంగాణకు యూపీఏ పచ్చజెండా

 

 telangana ku congress ok, telangana cwc meeting, congress telangana

 

 

సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణాపై చర్చించేందుకు సోనియా నివాసంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యుపిఏ సమన్వయ కమిటీ, సిడబ్ల్యూసీ లో తెలంగాణ పై ఏకగ్రీవ తీర్మానం జరిగాయి. హైదరాబాద్ ను రెండు ప్రాంతాలకు రాజధానిగా నిర్ణయించడం జరిగింది.


రేపు జరగనున్నకేంద్ర క్యాబినెట్ సమావేశంలో యూపీఎ మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తీసుకొన్ననిర్ణయాన్నిఆమోదం పొందిన తరువాత, దానిని రాష్ట్రపతి అనుమతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఆ ప్రతిపాదనను పంపి దానిపై తీర్మానం కోరుతారు. రాష్ట్ర శాసనసభ తెలంగాణా బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినట్లయితే, అప్పుడు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఒకవేళరాష్ట్ర శాసనసభ తెలంగాణాను వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసినప్పటికీ, కేంద్రందే అంతిమ నిర్ణయం గనుక యుపీయే ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుంది.