టీ సర్కార్ కు ప్రపంచ బ్యాంకు తిరకాసు

 

తెలంగాణ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు ఝలక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి గాను సుమారు రూ. 58,500 కోట్ల రూపాయలు సాయం చేయాల్సిందిగా సహాయం కోరింది.

 

* తాగునీటి పథకాలకు రూ.25 వేల కోట్లు

* హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లైకి రూ.14 వేల కోట్లు

* విద్యుత్తు సరఫరా వ్యవస్థ మెరుగునకు రూ.4 వేల కోట్లు

* గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు

* మిషన్‌ కాకతీయకు రూ.3500 కోట్లు

* హైదరాబాద్‌-వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కావాలని సర్కార్ కోరింది.

 

అయితే ప్రపంచ బ్యాంకు కేంద్రం ఓమాట చెబితే కాని మీకు రుణం ఇస్తామని తిరకాసు పెట్టింది. కేంద్రం ఓకే అంటే ఇవ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రవికుమార్ ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ప్రతిపాదనలు, అవసరాలను పరిశీలించిన తర్వాత టి-సర్కార్‌ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో టీసర్కార్ ఏం చేయలేని పరిస్థితిలో పడింది.