తెలంగాణలో మరోసారి ఎల్ఆర్ఎస్ అమలు చేయనున్న ప్రభుత్వం...

తెలంగాణలో మరోసారి ఎల్ఆర్ఎస్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి ముప్పై నాటికి ఉన్న స్థలాలకు క్రమబద్ధీకరణ అవసరం కల్పించారు. అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనే ఈ అవకాశం కల్పిస్తోంది. దరఖాస్తులు చేసుకోవటానికి తొంభై రోజుల గడువు విధించింది. కొత్త మునిసిపాలిటీలు కార్పొరేషన్ ల పరిధిలో ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనధికార లేయవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. రెండు వేల పధ్ధెనిమిది మార్చి ముప్పైకి ముందు ఏర్పాటు చేసిన అనధికార లేయవుట్ లనే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేసింది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ క్రమబద్ధీకరిస్తుంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లు హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఉంటే, హెచ్.ఎం.డీ.ఏనే క్రమబద్ధీకరిస్తోందని వెల్లడించింది. మార్కెట్ విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుములు ఉంటాయి. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారిలో పార్కుల వంటి వాటికి స్థలాన్ని కేటాయించే అవకాశం లేకపోతే దరఖాస్తు దారుడు ఆ స్థలానికి సంబంధించిన రుసుములు కూడా కట్టాలి.

దరఖాస్తులు ఆన్ లైన్ లోనే సమర్పించాలి, తొంభై రోజుల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెట్ విలువలో పది శాతం లేదా పది పేర్ల లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని డీటీసీపీ లేదా హెచ్ఎండీఏ లేఖ జారీ చేసిన తదుపరి చెల్లించాలి. డబ్బు చెల్లించిన ఆరు నెలల్లోగా ఎల్ఆర్ఎస్ అనుమతి ఇస్తారు. తిరస్కరించిన వాటిని అప్పిలేట్ అథారిటీకీ దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు ఎల్ఆర్ఎస్ లో క్రమబద్ధీకరణ నుంచి కొన్నింటిని మినహాయించారు. నదులు, నాలాలు, చెరువుల పరిధి, చెరువులు, కుంటల, ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ పరిధిలోని శిఖం భూముల్లో వెలిసిన లేయవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. సహజ వాయువు చమురు పైప్ లైన్ ల పరిసరాల్లో ఉన్న భూములను కూడా క్రమబద్ధీకరించరు. నోటిఫై డెవలప్ మెంట్ ప్లాన్ లో పారిశ్రామిక ప్రాంతాలు రిక్రియేషనల్ యూజ్ జోన్, వాటర్ బాడీ, ఓపెన్ స్పేస్ కింద గుర్తించిన స్థలాలలోనూ క్రమబద్ధీకరణ జరగదు. క్రమబద్ధీకరణకు పద్నాలుగు, పది, రెండు వేల పంతొమ్మిదిన ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటారు.