కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల.. పాపం పొన్నాల

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ 65 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ 10 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా విడుదల చేసింది. అయితే రెండో జాబితాలో కూడా పొన్నాల పేరు లేదు. దీంతో జనగాం నుంచి పొన్నాల బరిలోకి దిగుతారా? లేక టీజేఎస్ బరిలోకి దిగుతుందా అనే ఉత్కంఠ ఇంకా వీడలేదు.

కాంగ్రెస్‌ రెండో జాబితా వివరాలు:

  1. ఖానాపూర్‌- రమేశ్‌ రాథోడ్‌
  2. ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌
  3. ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
  4. సిరిసిల్ల- కె.కె.మహేందర్‌రెడ్డి
  5. మేడ్చల్‌- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  6. ఖైరతాబాద్‌- దాసోజు‌ శ్రవణ్‌కుమార్‌
  7. జూబ్లీహిల్స్‌- విష్ణువర్ధన్‌రెడ్డి
  8. షాద్‌నగర్‌- సి.ప్రతాప్‌రెడ్డి
  9. భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి
  10. పాలేరు- కందాల ఉపేందర్‌రెడ్డి