జూన్ 2న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు: హోంశాఖ

 

జూన్ 2వ తేదీన తెలంగాణా అపాయింటడ్ డేట్ అని కొద్ది సేపటి క్రితమే హోం శాఖ ప్రకటించింది. అంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోయి, దేశంలో 29వ రాష్ట్రంగా అధికారికంగా ఉనికిని పొందుతుంది. దీనితో తెలంగాణా ప్రజల 60 ఏళ్ల కల సాకారమవుతుంది.