10 నిమిషాల్లో సాధ్యమా? రాజారెడ్డి రాజ్యాంగమా?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ ఇచ్చిన నోటీసులు వివాదాస్పదంగా మారుతున్నాయి. నెల్లూరులో ఉమా ఉండగా.. ఉదయం 10.20 గంటలకు విజయవాడలోని ఆయన ఇంటికి నోటీసు అట్టించి.. 10 నిమిషాల్లో కర్నూలు సీఐడీ ఆఫీసుకు రమ్మనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీడీపీ ఘాటుగా ట్వీట్ చేసింది. 

‘‘తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవినేని ఉమాకు ఒక కేసు విషయమై నోటీసులు ఇవ్వాల్సిన పోలీసులు ఉదయం 10.20గంటలకు విజయవాడలోని గొల్లపూడి నివాసానికి నోటీసు అంటించారు. ఆశ్చర్యం ఏంటంటే 10.30గంటల కల్లా కర్నూలు సీఐడీ ఆఫీస్‌లో ఉండాలని ఆ నోటీసులో ఉంది. తిరుపతి ప్రచారంలో ఉన్న వ్యక్తికి విజయవాడలో నోటీసు ఇచ్చిన విషయం తెలియడానికే పది నిమిషాలు పడుతుంది. అలాంటిది నెల్లూరులో ఉన్న వ్యక్తి పది నిమిషాల్లో కర్నూలు ఎలా వెళ్లగలడు? కక్ష సాధింపునకు కూడా హద్దులు ఉండాలి కదా! 10 నిమిషాల్లో జిల్లాలు దాటి రావాలంట.. ఇది అంబేడ్కర్ రాజ్యాంగమా.. రాజారెడ్డి రాజ్యాంగమా’’ అంటూ ట్వీట్టర్‌లో మండిపడింది టీడీపీ.