పంచాయితీల్లో సత్తా చాటిన టిడిపి

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి విడత పోలింగ్ లో 26 రెవెన్యూ డివిజన్లలో 5803 గ్రామ పంచాయితీల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం దాదాపు అన్ని జిల్లాలోనూ టిడిపి ముందంజలో ఉండగా, కాంగ్రెస్ వైసిపిలు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

 

ప్రస్థుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల ఫలితాల ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ పంచాయితీ ఎలక్షన్స్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కింది స్ధాయిలో ఏమాత్రం కేడర్ లేకపోవటంతో వైసిపి దాదాపు అన్ని చోట్లా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..


మరి కొన్ని గంటల్లో పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ పూర్తి ఫలితాలు వెలుడనుండగా ఈ ఫలితాలు రెండు మూడో దశలలో జరిగే పోలింగ్ పై కూడా ప్రభావం చూపిస్తాయంటున్నారు విశ్లేషకులు.