‘అఖిలపక్షం’ ఫై గాలి ఆసక్తికర వ్యాఖ్యలు

 

TDP telangana, Gali Muddu Krishnama Naidu  telangana, telangana issue

 

డిసెంబర్ 28 న తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించడం అందరికీ సంతోషమే. అయితే, ఈ అంశం ఫై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఎఫ్ డి ఐ లఫై ఓటింగ్ లో ఓడిపోతామన్న భయంతోనే ఈ తేదీని ప్రకటించారనీ, ఈ నిర్ణయం వల్ల ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఎలాంటి ముందడుగు ఉందనేది ఆయన మాటల్లోని సారాంశం.



శ్రీ కృష్ణ కమిటి వేసి హడావుడి చేసినట్లే, ప్రస్తుత తేది ఉందనీ ఆయన అన్నారు. ఒక్క సారి గతాన్ని పరిశీలిస్తే, ముద్దు కృష్ణమ నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అర్ధమవుతుంది. తెలంగాణా ఫై రాష్ట్రపతి ప్రసంగంలో చోటు, శ్రీ కృష్ణ కమిటి వేసి చివరకు దానిని కూడా పక్కన పెట్టడం, ఇంకా ఒకటీ, అరా ప్రయత్నాలు కూడా చేసి చివరకు ఏకాభిప్రాయమే శరణ్యం అనడం వంటివి చూస్తుంటే, నాయుడు మాటల్లో ఎంతో నిజం ఉందని అనిపిస్తోంది. ఏది ఏమైనా గాలి మాటలు నిజం కాకూడదని, ఈ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఓ స్పష్టత వస్తుందని ఆశిద్దాం.