సం'గ్రామం'లో టిడిపి టాప్

 

TDP Panchayat Elections,  2013 Panchayat Elections, congress ysr congress

 

 

రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో పోలింగ్ కి ముందే టిడిపి పార్టీ దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ప్రస్తుతానికి మెజార్టీ స్థానాల్లో పాగా వేశారు. టిడిపి బలపరిచిన అభ్యర్ధులే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవం కావడంతో తెలుగు తమ్ముళ్ళ ముఖాల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి.

 

మంగళవారం నాటికి 1219 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 457 టీడీపీ మద్దతుదారులకు దక్కడంతో ఆ పార్టీ ముందంజ వేసింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 240, వైసీపీ 142తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీఆర్ఎస్‌కు 36, న్యూ డెమోక్రసీకి 12, సీపీఎంకు 6, సీపీఐకి 2, బీజేపీకి 2 పంచాయతీలు లభించాయి.  


జిల్లాలవారీగా... చిత్తూరు-80, గుంటూరు-43, ప్రకాశం-39, నెల్లూరు-36, శ్రీకాకుళం-34, కృష్ణా-29, ఆదిలాబాద్-28, పశ్చిమ గోదావరి-23, విజయనగరం-22, మహబూబ్‌నగర్-21 వంతున టీడీపీకి దక్కాయి. చిత్తూరు-28, శ్రీకాకుళం-20 వంతున కాంగ్రెస్‌కు లభించాయి. వైసీపీకి చిత్తూరు-27, కడప-24 చొప్పున వచ్చాయి. టీఆర్ఎస్‌కు నిజామాబాద్ జిల్లాలో 23 వచ్చాయి.