రోడ్డున్న పడుతున్న నేతలు

 

 

 

అనంతపురం జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లు ఆశించిన కొందరు నాయకులు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటించి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్న డబ్బుంతా వదిలించుకున్నారు. సేవలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో విజయం సాధించినా.. టికెట్లు మాత్రం దక్కే సూచనలు కనిపించలేదు. దాంతో పోయిన డబ్బులు లెక్కలేసుకుంటూ.. కక్కలేక.. మింగలేక లోలోన మధనపడిపోతున్నారు.

 

రాయదుర్గం నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత పార్టీ టికెట్ ఆశించి ఏడాది నుంచి విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలు,  సేవా కార్యక్రమాలు అంటూ లెక్కకు మించి ఖర్చు చేసుకున్నారు. కానీ ఇప్పుడు టికెట్ దక్కే సూచనలు కనిపించట్లేదు. దాంతో సేవలకు రాం..రాం...చెప్పారు.



కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో బాగా గడించారు. దీనికి తోడు కాంట్రాక్టు పనులు చేసి అనతికాలంలోనే కోట్లు సంపాదించారు. టికెట్ వస్తుందన్న ఆశతో, గుడులు..గోపురాలకు ఇతోదిక విరాళాలు అందజేశారు. యువతకు క్రికెట్ కిట్లు, పండుటాకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో అయిన కాటికి ఖర్చు చేసి పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. తీరా చూస్తే..ఈ నాయకునికి కాకుండా మరో నాయకునికి అధిష్టానం టికెట్టు ఖరారు చేయనున్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు.