Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తాండూర్ ఎమ్మెల్యేది దొంగ ఓటే!
posted on: Mar 22, 2021 4:13PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినా వికారాబాద్ జిల్లాలో ఓట్ల పంచాయతీ కొనసాగుతోంది. తాండూర్‌లో దొంగ ఓట్ల వ్యవహారం మరింత ముదురుతోంది.మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ఓటు వ్యవహారంలో దుమారం రేగుతుండగానే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశాడని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి... మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది కూడా దొంగ ఓటేనన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దొంగ ఓట్లు వేసిన తాండుర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తను పట్టభద్రురాలు కాదని తెలిసి దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నను పదవి నుంచి బర్తరప్ చేయాలని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు.. అధికారులను ప్రలోభాలకు గురి చేయడంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారన్నారు. అమె దొంగ ఓటు వేడయడం నేరమని.. స్వప్నపై కఠిన చర్యలు తీసుకొవాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.



.jpg)


