అందాల తమ్మన్నాకు సమైక్య సెగ

 

ఈరోజు తన సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన అందాల తార తమ్మన్నాకు వైజాగ్ విమానశ్రయంలో సమైక్యాంధ్ర సెగ తగిలింది. అక్కడ మంత్రులు యంపీలకోసం కాపుకాసుకొని కూర్చొన్న కొందరు సమైక్యవాదులు ఆమె కారును చుట్టూ ముట్టి ‘జై సమైక్యాంధ్ర’ అని నినాదం చేయమని అడిగినప్పుడు ఆమె తనకీ ఉద్యమాలతో సంబంధం లేదని తానొక కళాకారిణినని, తనకు అన్ని ప్రాంతాల ప్రజలతో అనుబంధం ఉందని జవాబివ్వడంతో వారు కనీసం “తెలుగువారు కలిసుండాలి” అని అనమని కోరారు. కానీ ఆమె అనకపోవడంతో కొంచెం అసహనానికి గురయిన వారు ‘జై తెలుగు’ అనమని ఒత్తిడి చేసారు. కానీ ఆమె ‘జై ఇండియా’ అని తన కారులో వెళ్లిపోయింది.

 

ఇంత కాలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణావాదులు చుక్కలు చూపించారు. ఇప్పుడు సమైక్యవాదులు ఆ పనికిపూనుకోవడం విచారకరం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో అనుబంధం ఉన్నట్టి చిత్రపరిశ్రమను ఉద్యమకారులు ఈవిధంగా ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు. ముఖ్యంగా సినీపరిశ్రమలో అత్యధికులు సీమంద్రా ప్రాంతానికి చెందినవారేననే విషయం గమనించాలి. అందువల్ల వారిచేత బలవంతంగా ఇటువంటి నినాదాలు చేయమని ఒత్తిడి చేయడం షూటింగులకి ఆటంకం కలిగించడం వంటివి చేయకుండా, వారి పని వారిని చేసుకోనిస్తే తమ ఉద్యమానికి వన్నె పెరుగుతుందే తప్ప తగ్గదని తెలుసుకోవాలి.