ఎంఐఎం తో పొత్తు మాట ఎత్తకండి: తలసాని

 

 

talasani srinivas yadav, TDP talasani srinivas yadav, MIM TDP, TDP Revanth reddy

 

 

"టిడిపి పార్టీ ఓడిపోయినా ఫరవాలేదు...కానీ ఎంఐఎం తో మాత్రం పొత్తు మాట ఎత్తకండి"అని అంటున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్. నగర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థికి టిడిపి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా అన్నట్లు గురువారం రేవంత్ రెడ్డి తదితర టిడిపి నేతలు మజ్లిస్ నేతలతో భేటీ అయ్యారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా తలసాని మజ్లిస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెప్పడం చర్చనీయాంశమయింది.