అమెరికాలో దారుణం: ఉన్మాది @ విద్యార్థి!

Publish Date:Apr 10, 2014

 

 

 

అమెరికాలోని విద్యావిధానం కారణంగా విద్యార్థులు స్ట్రెస్‌కి గురై దారుణాలకు ఒడిగడుతున్నారో లేక అక్కడి పెంపకమే దారుణంగా వుందో గానీ, విద్యాలయాల్లో దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తోటి విద్యార్థుల మీద దాడులు, దారుణ హత్యలు చేస్తున్న సైకోల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.


ఇప్పుడు మరో సైకో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పెన్సిల్వేనియా రాస్ట్రంలోని మరీస్ విల్లే ప్రాంతంలోని ఓ విద్యాలయంలో ఒక విద్యార్థి దారుణంగా బిహేవ్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని విద్యాలయంలో వీరవిహారం చేశాడు. తమలో ఒకడిగా వున్న విద్యార్థి సడెన్‌గా ఉన్మాదిలా మారి కత్తితో దాడి చేయడంతో విద్యార్థులందరూ చెల్లాచెదురైపోయారు. పారిపోతున్నవారిని కూడా వదలకుండా సదరు ఉన్మాది వాళ్ళని కసితీరా పొడిచి గాయపరిచాడు. మొత్తం ఇరవై మందిని దారుణంగా పొడిచిన ఉన్మాదిని ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. టైమ్ బాగుండి ఉన్మాద విద్యార్థి చేతిలో గాయపడిన వారెవరికీ ప్రాణాపాయం లేదు.

By
en-us Political News