స్వైన్ ఫ్లూతో మరో ముగ్గురి మృతి

 

స్వైన్ ఫ్లూ వ్యాధితో హైదరాబాద్‌లో గురువారం నాడు మరో ముగ్గురు మరణించారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, ఉస్మానియా ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఇప్పటి వరకూ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 32కి చేరింది. స్వైన్ ఫ్లూ వ్యాధి తగ్గిందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ బుధవారం నాడు చెప్పారు. కానీ ఇంతలోనే మరో ముగ్గురు మరణించారు. మొదట్లో స్వైన్ ఫ్లూ మీద చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత స్వైన్ ఫ్లూ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రభుత్వం లైట్‌గా తీసుకోవడంతో స్వైన్ ఫ్లూ వ్యాధి పెరిగిపోయింది. హైదరాబాద్‌ నగరంలో వివిధ ఆస్పత్రులలో స్వైన్ ఫ్లూతో బాధపడుతూ వందలాది మంది చికిత్స పొందుతున్నారు.