నోట్ల రద్దుపై స్టేకు సుప్రీం నిరాకరణ...

 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పెద్దనోట్ల రద్దుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇంకా ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. నగదు మార్పిడి, ఉపసంహరణకు ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు ఉపసంహరణ పరిమితిని పెంచితే ఏమవుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 25కు వాయిదా వేసింది.