ఆల్ఫాబెట్ హెడ్... ప్రపంచఖ్యాతి చెందిన తమిళ తంబి


గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో అత్యున్నత బాధ్యతలను చేపడుతున్నారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెర్జీ బ్రిన్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సిఇఒగా సుందర్ పిచాయ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 21 సంవత్సరాల కిందట గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ను స్థాపించిన పేజ్ బ్రిన్లు కంపెనీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజంగా మారనున్నారు. టెక్నాలజీ పై వినియోగదారులు గూగుల్ ఉద్యోగుల్లో భాగస్వాముల్లో ఫ్యాషన్ ను సుందర్ పిచాయ్ తీసుకువచ్చాడని గూగుల్ ను అల్ఫాబెట్ ను భవిష్యత్తు వైపు నడిపించడానికి అంతకంటే సమర్థుడో మరొకరు లేరనే ఉద్దేశం తోనే సుందర్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు లారీ పేజ్ సర్గీబ్రిన్ లు ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆల్ఫాబెట్ ప్రస్తుతం ప్రపంచం లోనే అత్యంత విలువైన కంపెనీలోని ఒకటి. 2018 లో ఆల్ఫాబెట్ లాభం 30 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయం 136.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆల్ఫాబెట్ గ్రూపుల్ లో ఉన్న లైఫ్ సైన్సెస్ గ్రూప్ వైరల్ ఐ బయటకు అపరేషన్ సంస్థ కాలికో వంటివి ఇంకా నష్టాల్ లోనే ఉన్నాయి. గూగుల్ లాభాల్ని తెచ్చి పెట్టుబడులుగా పెట్టినప్పటికీ ఈ సంస్థలు ముందుకు కదలడం లేదన్నారు. మరి సుందర్ సిఇఒగా బాధ్యతలు తీసుకున్నాక ఇలాంటి సమస్యల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

పిచాయ్ ఇక పై సర్చ్ వ్యాపార ప్రకటనల్లో నాప్స్, స్మార్ట్ స్టాఫ్ వేర్, ఆన్ లైన్ వీడియో తదితర విభాగాలతో పాటు డ్రోన్ డెలివరీలు, ఇంటర్నెట్ బీమింగ్ బెలూన్స్ వంటి వాటికి ఏకైక అధిపతి కానున్నారు. రెండు దశాబ్దాల కిందట గూగుల్ ని ఏర్పాటు చేసిన పేజ్ బ్రిన్లు 2015 లో పిచాయ్ గూగుల్ సీఈవోగా చేసి వారు అల్ఫాబెట్ లోకి వెళ్లారు. ఇప్పుడు రోజువారీ కార్యకలాపాల్లో తమ పాత్రను మరింత పరిమితం చేసుకున్నారు. కాగా తాజా మార్పులతో అల్ఫాబెట్ నిర్మాణంలో ఎటువంటి మార్పు ఉండదని పిచాయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇదే కంపెనీలో పలు బాధ్యతలు నిర్వహించారు సుందర్ పిచాయ్. క్రోమ్ బాధ్యతలతో పాటు గూగుల్ ప్రొడక్ట్ చీఫ్, ఆండ్రాయిడ్ అధిపతిగా వ్యవహరించారు. గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక అంతా తానై నిర్వహించారు. ఆయన నాయకత్వంలో గూగుల్ వ్యాపార వృద్ధి కొనసాగింది. హార్డ్ వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ లోకి విస్తరించింది. తమిళనాడులోని మధురైలో పుట్టిన పిచాయ్ వార్టన్ బిజినెస్ స్కూల్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.