కర్నూలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి.. సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి!!

 

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ విద్యార్థి సంఘాలు శనివారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించారు. చాలా మంది విద్యార్థులు..విద్యార్థి సంఘం నేతలు.. కర్నూలులో హైకోర్టును, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో గత 3 నెలలుగా కర్నూలులో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో వాళ్ళందరూ ఏకంగా ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టారు.

రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా రాయలసీమలో రాజధాని, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం కూడా కళ్లకు గంతలు కట్టినట్టే వ్యవహరిస్తుంది. అనేక ప్రజాప్రతిధులకు వినతిపత్రాలిచ్చారు. ధర్నాలు చేసినప్పటికీ ఎటువంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండే వైఖరిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది.

రాయలసీమ అనేక సంవత్సరాలుగా దగా పడుతూనే వుంది. గత 82 సంవత్సరాల మునుపు ఎక్కడ పెద్దల ఒప్పందం జరిగిందో ఇదే రోజున కర్నూలులో ఉన్నటువంటి 14 మంది ప్రజాప్రతినిధుల యెక్క ఇళ్లను ముట్టడించి వాళ్లకి రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తుచేశారు. ఇప్పటికైనా మీరు.. ప్రభుత్వం పై, సీఎం పై ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమలో హైకోర్టు అనే ప్రకటన వెంటనే చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.