కడుపులో పుండు  

 

  
మనం తినే ఆహారం జీర్ణమయ్యే సమయంలో కుక్షి, జఠరం, నాభి, పొత్తికడుపు, స్తనమధ్య  ప్రదేశం, నడుము, పక్కటెముకలందు నొప్పి వస్తుంది. దీనినే పరిణామ శూల కడుపులో పుండు అని అంటారు.  ఇది భుజించిన వెంటనే వాంతి చేసుకున్నాప్పుడు ఆహారమంతా జీర్ణమైనప్పుడు వస్తుంది. వరి అన్నం ఎక్కువ తిన్నప్పుడు వస్తుంది.


ముందు జాగ్రత్తలు:   

ఇలా వచ్చినప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు ఏమిటంటే.... మినుములు లాంటి పప్పు ధాన్యాలు, మద్యములు, స్త్రీ సంభోగాలు, శీతల పదార్ధాలు ఎండతిరుగుడు, నిద్రలో మేల్కొని కాలక్షేపం చేయటం, కోపము, దుఃఖము, ఆమ్ల పదార్ధసేవనం, అజీర్ణపదార్ధములు నువ్వులు లాంటివన్నీ నిషిద్దములు.  పొట్లకాయలు, కాకరకాయలు, చక్రవర్తి కూర, మునగకూర, ఉప్పు, వెల్లుల్లి, సంవత్సరం దాటిన పాత బియ్యం, ఆముదం, గోమూత్రం, వేడి నీరు, నిమ్మపండురసం, క్షార చూర్ణము వంటివి పధ్యములు.


మందుజాగ్రత్తలు: 

శొంఠి, నువ్వులు, బెల్లము తీసుకొని కలిపి ముద్దగా నూరి పాలలో కలిపి సేవిస్తే ఏడురోజులలో పరిణామాలశూల శమిస్తుంది. పిప్పళ్ళ చూర్ణానికి మండూర భస్మ, తేనె కలిపి సేవిస్తే కడుపులో పుండు వెంటనే తగ్గుతుంది. పిప్పళ్ళచూర్ణం, కరకవలపు చూర్ణం, లోహభస్మమును సమభాగాలు గా కలిపి తేనె నేతులలో సేవిస్తే తీవ్ర పరిణామశూల వెంటనే శమిస్తుంది. భోజనమైన తరువాత ధాత్రీలోహము, సూతశేఖర రసము సేవిస్తే సత్ఫలితాలు లభిస్తాయి.... ఇదే కనక అమలుచేస్తే... కడుపులో పుండు...ఇక్కడితో ఎండు...