మెగా ఫ్యామిలీలో హీరో.. అది శాపమే

 

దర్శకమౌళి రాజమౌళి మెగా ఫ్యామిలీ హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమా రూపుదిద్దుకుంటుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన రాజమౌళి మెగా ఫ్యామిలి గురించి మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలి నుండి హీరోగా సినీ పరిశ్రమకు రావడం ఒక రకంగా అదృష్టమైనా అది ఒక రకంగా శాపం కూడా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.



ఎందుకంటే సాధారణంగా ఒక సినిమా తీసి అది ప్రేక్షకులకు నచ్చాలంచే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారిపోయింది.. అలాంటిది అసలే మెగా ఫ్యామిలీపై ప్రక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.. అలాంటి వారి అంచనాలను రీచ్ అవ్వాలంటే వరుణ్ తేజ్ ఇంకా చాలా కష్టపడాలని.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకోవాలని అప్పుడే ఈ తీవ్రమైన పోటీలో వరుణ్ తేజ్ నిలబడగలుగుతాడంటూ వివరణ ఇచ్చారు. అయితే రాజమౌళి పాజిటివ్ గానే అన్నా ఈ వ్యాఖ్యలను కొంతమంది పాజిటివ్ గా.. కొంతమంది నెగెటివ్ గా తీసుకుంటున్నారు.