ఒకేసారి 3800 ముద్దులు

 

ఒకేసారి 3800 జంటలు వివాహ దుస్తులు ధరించి చేతిలో చేయి వేసుకొని నాకు నువ్వు నీకు నేను అంటూ సరిగమలు పాడుతుంటే ఎలా ఉంటుంది. ఈ 3800 మంది సరిగమలతో ఆగారా... సరిగమల్లోంచి డైరెక్ట్గ్ గా పదనిసల్లోకి వెళ్లిపోయి ఒకేసారి ముద్దులు పెట్టేసుకున్నారు. దక్షిణ కొరియాలోని ఓ చర్చి ప్రాంగణంలో ఈ పరమ రంజైనదృశ్యం చోటుచేసుకుంది. అసలు విషయం ఏంటంటే మియాంగ్ మూన్ అనే వ్యక్తి 1954లో దక్షిణ కొరియాలో యూనికేషన్ చర్చిని నిర్మించాడు. ఆయన నిమోనియా కారణంగా 2012లో చనిపోయాడు. మియాంగ్ మూన్ ను మెస్సయ్యగా భావించే స్థానిక క్రైస్తవులు ఆయన చనిపోయి మూడేళ్లు అయిన సందర్భంగా ఆ చర్చిలో వివాహం జరుపుకున్న వారందరు తమ వివాహపు దుస్తులు ధరించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి తమ అభిమానాన్ని తెలిపారు. ఆ తరువాత మద్దుల మూడ్ లోకి వచ్చారు. మియాంగ్ భార్య హక్ జా హానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎక్కువ శాతం యువ జంటలే ఉండటం విశేషం.