సిరివెన్నెల సీతారామశాస్త్రీగారి బర్త్‌ డే స్పెషల్‌

 

 

sirivennala sitaramasastri birthday, sirivennala sitaramasastri happy birthday,  happy birthday sirivennala sitaramasastri

 

 

 

వాన బొట్టు ఆల్చిప్పాలో పడితేనే ముత్యం అవుతుంది.

అదే చినుకు సముద్రంలో పడితే అలలలో కొట్టుకుపోతుంది అలా సాక్షాత్తు సరస్వతీ దేవి తెలుగు తెరకు అందించిన అపురూప ఆణిముత్యం సీతారామశాస్త్రీ తన తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రీ ప్రస్థుతం తెలుగు సినిమా సాహిత్యానికి పెద్దదిక్కుగా నడిపిస్తున్నారు..

 

 ఆయన కలం అన్ని భావాలను అవలీలగా పలికిస్తుంది.. సిరివెన్నెల గారి పాటల్లో జీవిత సత్యాలు ఆలోచింప చేస్తాయి కొత్త జీవన మార్గాన్ని చూపిస్తాయి.. కోటీశ్వరున్ని కూటికి గతిలేని వాన్ని ఒకే బండి ఎక్కిస్తాయి.. ఒకే గమ్యాన్ని చేరుస్తాయి..

 



   

   

సీతారామశాస్త్రీగారి పాటలలో బరువైన పద ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.. మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేయాజారాకా అన్న పదం ఆయన తప్ప ఇంకెవరు రాయగలరు.. అందుకే ఆయన తెలుగు సినిమా సాహిత్యాన్ని శాసించగలుతున్నారు

     

 భారీ పద ప్రయోగాలు బరువైన మాటలే కాదు ఆయన చిన్న చిన్న పదాలతో ఈ తరానికి అర్ధమయ్యేలా అలరించేలా కూడా పాటలు రాయగలరు.. ఖడ్గం సినిమాలో ఆయన రాసిన ముసుగువేయోద్దు మనసు మీద అన్నపాటలో ఎంత ఆధునికత ఉందో అంతే జీవిత సత్యం కూడా ఉంది..



  

    

ఎలాంటి సందర్భం మీదైనా ఎలాంటి విషయం మీదైనా పాట రాయగలిగిన సీతారామశాస్త్రీ ఆయన ఇష్టం దైవం పరమేశ్వరుని మీద పాట అంటే మరింత ప్రేమగా రాస్తారు.. ఆ అవకాశం ఆయన తొలి సినిమాలోనే వచ్చింది.. ఆ అవకాశమే ఆది భిక్షువు వాడినేమి అడిగేది అంటూ పాటగా ప్రవహించింది..

      

సంధేశాత్మక మాటలతో పాటలే కాదు, చిన్న చిన్న పదాలతో ఆకట్టుకునే పాటలు కూడా రాయగలరు సిరివెన్నెల.. అలా ఆయన రాసిన అల్లరి పాటల్లో కూడా నీతి బోదలే కనిపిస్తాయి.. అందుకే ఆయన సిరివెన్నెల అయ్యాడు..

      

ప్రాసలు, గమకాలతో కూడా ఆయన ఆడుకోగలడు అందుకే ఆయన పాటల్లో శాస్త్రీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది…  తెలుగు పాటకు పంచామృతాల పవిత్రను కల్పించిన సిరివెన్నెలగారు వెండితెర మీద చేయని ప్రయోగం లేదు..

      

సీతారామశాస్త్రీ గారి కలానికి అన్ని వైపులా పదునే ఉంటుంది.. అందుకే ఆయన ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలరు.. అద్భుతమైన భక్తి పాటలను రాసిన ఆయన ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి రోమాంటిక్‌ సాంగ్‌తో కూడా మెప్పించారు..

      

ఓ మంచి రచయితకు సరైన సందర్భంగా దొరికితే ఎలాంటి పాట వస్తుందో సీతారామ శాస్త్రీగారు చాలా సార్లు నిరూపించారు… పవిత్రబందం సినిమాలో ఆయన రాసిన అపురూపమైనదమ్మ ఆడజన్మ పాట అలాంటి పాటల్లో ఒకటి..

    

   అచ్చమైన తెలుగు పదాలతోనే కాదు.. ఆయన పల్లెపదుల జానపదాలతోనూ ప్రయోగాలు చేయగలడు.. రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన నమ్మకు నమ్మకు ఈ రేయిని పాట.. ఆయనకు తెలుగు భాషమీద ఉన్న పట్టుకు ఓ నిదర్శనం..

     

  సీతారమశాస్త్రీ ఓ రచయిత మాత్రమే కాదు సమాజంలోని తప్పులను ప్రశ్నించే ఓ సమాజ సేవకుడు కూడా.. అందుకే దశాబ్దాల క్రితమే ఆయన ఈ సమాజంలోని సిగ్గులేని జనాల్ని నిగ్గదీసి అడగమంటూ పిలుపునిచ్చారు.

      

దేశంలోని రాజకీయ సామాజిక వ్యవస్థల మీద కూడా సీతారామశాస్త్రీగారికి మంచి అవగాహన ఉంది.. అందుకే ప్రస్థుత రాజకీయ సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా అంటూ ప్రశ్నించాడు..


     

 

పదాలతో ఎలాంటి ప్రయోగాలు చేసినా ఆయనలో లోతైన తత్వవేత్త కూడా ఉన్నాడు.. అందుకే ఆయన జగమంత కుటుంబం నాది అంటూనే ఏకాకి జీవితం నాది అంటూ నిట్టూరుస్తాడు. సంసార సాగరం నాదంటూనే సన్యాసం శూన్యం నాదంటాడు.. ఆయన చెప్పిన తత్వం.. ఆయన మాత్రమే చెప్పగలిగిన వేదాంతం..

     

  సిరివెన్నెల కలం నుంచి వచ్చిన  మరో అద్భుతం జరుగుతున్నది జగన్నాటకం.. దశావతార ఘట్టాన్ని నేటి జీవన విదానానికి ఆయన అన్వయించిన తీరు నిజంగా అద్భుతం.. అది సీతారామ శాస్త్రీకి మాత్రమే సాధ్యం..

      

ఆత్రేయ వేటూరి లాంటి మహానుభావుల తరానికి, చంద్రబోసు, అనంత శ్రీరామ్‌ లాంటి ఈ తరానికి మధ్య ఆయన వారథి.. నేటి సినీ సాహిత్యానికి రథసారథి.. అందుకే  ఈ సిరివెన్నెల మరింత కాలం మన వెండితెర మీద విరబూయాలని కోరుకుంటూ సీతారామశ్రాస్తిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము..