ఒకే ఒక్కామె..

 

ఎవరూ సాధించలేని ఘనతను సాధించిన వ్యక్తిని ఒకే ఒక్కడు అని అంటాం. అదే ఘనతను ఒక మహిళా సాధిస్తే ఒకే ఒక్కామే అని అనాలి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నుంచి జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సింతు శకుంతల సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్టంలో 1096 జెడ్పీటీసీ స్థానాలలో ఏకగ్రీవంగా ఎన్నికైనది ఇదొక్కటే. శకుంతల టీడీపీ బీ ఫారంతో నామినేషన్ వేసింది.

 

గతంలో జెడ్పీ వైస్ చైర్మన్ గా, నరసన్నపేట ఎంపీపీగా పని చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిమ్మ ఉషారాణి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసింది. ఉషారాణి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. ఇక్కడ కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసేందుకు అభ్యర్ధి కూడా దొరకని పరిస్తితుల్లో టీడీపీ అభ్యర్ధి శకుంతల ఏకగ్రీవంగా ఎన్నికైంది. సిమ్మ ఉషారాణి మామా, భర్త ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతురాలు, రాజకీయవేత్త అయిన ఉషారాణి నామినేషన్ చెల్లలేదంటే శకుంతల లక్ కాకపొతే మరేంటి అని నరసన్నపేట జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.