అఫ్జల్ కు ఉరిశిక్ష, రాష్ట్రపతికి అభినందనలు

 

 

Shiv Sena welcomes hanging of Afzal guru, Shiv Sena hanging of Afzal guru

 

 

అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించటంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శివసేన అభినందనలు తెలిపింది. పార్లమెంట్పై దాడి కేసు నిందితుడు అఫ్జల్కు ఉరిశిక్ష అమలుపై ప్రణబ్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించింది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రణబ్ మాతృశ్రీకి వచ్చినప్పుడు అఫ్జల్కు ఉరిశిక్ష విధించాలని బాల్ఠాక్రే కోరారని శివసేన గుర్తు చేసింది.


అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయటం సరైన నిర్ణయమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. చట్టప్రకారమే ఉరిశిక్షను అమలు చేశామని, ఉగ్రవాదులపై ఉన్న పెండింగ్ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా పరిష్కరించాలని,  ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు.