సోషల్ మీడియాకే షిండే హెచ్చరిక

 

 

 

ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరికను జారీ చేసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెనక్కి తగ్గారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలను చేసినట్లు వివరణ ఇచ్చారు.

 

తన స్వంత జిల్లాలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ..  ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై దూమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు. తాను సోషల్ మీడియాను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.