మాజీ మంత్రి శంకరరావు అరెస్టు

Publish Date:Jul 8, 2013

 

Shankar Rao arrested, Former minister Shankar Rao arrested

 

 

మాజీ మంత్రి డాక్టర్ పి.శంకరరావు అరెస్టైయ్యారు. కోడలిని వేధించారన్న అబియోగం కేసులో ఆయనను సిసిఎస్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. శంకరరావు కోడలు వంశీప్రియ చేసిన ఫిర్యాదుపై ఈ అరెస్టు జరిగింది. తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని ఆమె ఆరోపించింది. అయితే శంకర్ రావు మాత్రం తన కుమారుడితో కోడలు వుండడంలేదని, వేరే వ్యక్తితో వుంటుందని మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. తమ తండ్రిని కక్షతోనే అరెస్టు చేశారని, శంకరరావు కుమార్తె సుస్మిత ఆరోపిస్తున్నారు. శంకరరావును నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.