రాహుల్ కి అడ్రస్ లేదు!

 

 

 

రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గానికి పదేళ్ళ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ, ఆయనగారికి ఇంతవరకు ఆ నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేదు. బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్తే ఇంటి అడ్రస్ తీసుకురా పో అని మేనేజర్ పంపించేశాడు. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం రాహుల్ గాంధీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎన్‌డీఎం)కి అప్లికేషన్ పెట్టుకుంటే, ఆయన ఆ దరఖాస్తుని తిరస్కరించేశాడు.


 నువ్వు గతంలో అమేథిలో వున్నట్టుగానీ, ఇకమీదట ఇక్కడే వుంటావని గానీ ఆధారాలు లేవు పొమ్మన్నాడు. దాంతో రాహుల్‌కి ఏం చేయాలో పాలుపోక కంగారుపడిపోతున్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికలలో వ్యయం చేసే డబ్బంతా అమేథీ నియోజకవర్గంలో వున్న బ్యాంక్ ద్వారా మాత్రమే చేయాలి.



ఆ ఖాతా తెరవాలంటే నివాస ధ్రువీకరణ పత్రం కావాలి. పదేళ్ళ నుంచి అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్న యువరాజు గారికి అక్కడ నివాస ధ్రువీకరణ పత్రం వచ్చే అవకాశం లేదు. నియోజకవర్గంలో అడ్రసే లేని ఇలాంటి ఎంపీని నమ్ముకున్న అమేథీ వాసులని ఎవరు కాపాడతారు? బైదబై మిస్టర్ రాహుల్ గాంధీ... రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సంపాదించడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసినంత ఈజీ కాదు.. మైండిట్! అమేథీలో రాహుల్‌కి ఇప్పుడు అడ్రస్ గల్లంతైంది. ఈ ఎన్నికలలో గెలుపు కూడా గల్లంతవుతుందేమో!