నిర్మాతని లోపలేశారు

 

సినిమాల్లో హీరోయిన్ల సంగతి ఎలా ఉన్నా చిన్న చిన్న సీరియళ్లలో నటించే ఆర్టిస్టులు, యాంకర్ల పై వేధింపులు షరా మాములైపోయాయి. ఇలాంటి ఘనకార్యమే చేసిన టీవీ సీరియళ్లు తీసే ఓ నిర్మాతను హైదరాబాద్ లోని సంజీవరెడ్డినగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న మహిళ సదరు నిర్మాత తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో ఆ నిర్మాతని అదుపులోకి తీసుకున్నారు. ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆ రంగంలోకి వెళ్తున్న వారిపై ఇలా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం.