ఆస్ట్రేలియా ఓపెన్ విజేత సెరీనా విలియమ్స్

 

ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది. సెరీనా విలియమ్స్‌కి ఇది 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. ఈ ఫైనల్లో సెరీనా విలియమ్స్, షరపోవా మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో సెరీనా షరపోవా మీద 6-3, 7-6 (7-5) స్కోరుతో విజయం సాధించింది. ఈ పోటీలో సెరీనా విజయం సాధిస్తుందని టెన్నిస్ పండితులందరూ ఎప్పటి నుంచో ఊహిస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. కొంతకాలంగా తక్కువ ప్రతిభ కనబరుస్తున్న షరపోవా ఫైనల్స్‌కి ఎలాగోలా నెట్టుకొచ్చింది. మాంచి దూకుడు మీద వున్న సెరీనా విలియమ్స్ ధాటికి షరపోవా నిలబడలేదని అందరూ ముందుగానే ఊహించారు.