దరిద్రం పట్టిన సీమాంధ్ర కాంగ్రెస్!

Publish Date:Apr 17, 2014

 

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ దరిద్రంలో మునిగిపోయినట్టుంది. ఎంత దరిద్రంలో మునిగిపోయిందీ అంటే, సీమాంధ్రలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఎన్నికల ఖర్చు నిమిత్తంపైసా కూడా ఇవ్వదట. చచ్చినట్టు ఎవరి ఖర్చువాళ్ళే పెట్టుకోవాలట. ఈ విషయం చెప్పిందెవరో కాదు.. సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.

 

సీమాంధ్రలో ఐదోతనం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ నిండు ముత్తయిదువగా చూడాలని తపిస్తున్న రఘువీరారెడ్డి మాటల్లోనే తప్ప చేతల్లో అలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఒకవేళ ప్రయత్నాలు చేసినా వేస్టని తెలిసే ఊరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా సీమాంధ్ర అభ్యర్థులకు ఎన్నిక ఖర్చు పైసా కూడా పార్టీ చెల్లించదని చెప్పడం దీనికి ఒక ఉదాహరణగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రలో ఎన్ని తంటాలు పడినా, ఎంత ఖర్చుపెట్టినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో పెట్టే ఖర్చుకూడా దండగఅనే నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్ వచ్చినట్టుంది.

By
en-us Political News