సీమాంద్రలో చ‌దువులు కూడా బంద్‌

 

సీమాంద్ర జిల్లాల్లో రోజు రోజుకు ఉద్యమం ఉదృతం అవుతుంది. ఇప్పటికే చాలా శాఖ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు స‌మ్మెలో పాల్గోంటుండ‌గా ఇప్పుడు తాజాగా సీమాంద్రల్లోని 13 జిల్లాల‌కు సంభందించిన ఉపాధ్యాయులు స‌మ్మెకు సిద్దం అవుతున్నారు. చాలా మంది ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో పాల్గొన‌క పోయినా ఉద్యోగులు, అన్ని వ‌ర్గాల ప్రజ‌లు స‌మైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారు.

ఇప్పుడు మిగిలిన ఉద్యోగ సంఘాల‌తో పాటు సమైక్యాంధ్ర కోసం  13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు కూడా సమ్మె చేయడానికి  సిద్ధమవుతున్నాయి. ఆ ప్రాంత ఉపాధ్యాయ సంఘాల నేతలు రేపు  హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఉపాద్యాయుల‌కు సీమాంద్ర స్థాయిలో జెఏసిలు లేక‌పోవ‌డంతో ఇప్పటి వ‌ర‌కు వారు నిర‌స‌న‌లకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

13 జిల్లాల ప్రతినిధులతో  బుధవారం హైదరాబాద్‌లో జరిగే కీలక  సమావేశంలో సీమాంధ్ర స్థాయి ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని  నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.