హలీం బట్టీల వల్లనే కూలీన సిటీలైట్ భవనం

Publish Date:Jul 9, 2013

 

Secunderabad building collapse,Secunderabad citi life building, citi life building collapse

 

 

హలీం బట్టీలే సిటీలైట్ కుప్పకూలడానికి కారణమా! అవుననే అంటున్నారు ప్రభుత్వ అధికారులు. సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ 'హలీం' కి చాలా ఫేమాస్. రంజాన్ నెల ప్రారంభం అయింది అంటే 'హలీం' రుచి చూడడానికి ఈ హోటల్‌కు ప్రతి రోజూ భారీగా కస్టమర్లు వస్తుంటారు. దీంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి హలీం బట్టీల కోసం పెద్దఎత్తున ఇటుకలను, ఇసుకను, మట్టిని బిల్డింగ్ పైకి తరలించారు. ఒక్కొక్క బట్టీ తయారీకి సుమారు 800 కిలోల సరుకులు అవసరమని అంచనా. దీని ప్రకారం.. ఎనిమిది బట్టీల బరువు దాదాపు 6.4 టన్నుల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే తయారీ మొదలుపెట్టడంతో హలీం బట్టీలనుంచి వెలువడే తీవ్రమైన వేడికి పైకప్పు బలహీనపడింది. పురాతన భవనంపై ఇంత బరువు వేయడం.. బట్టీ నుంచి వెలువడిన వేడిమి కారణంగా భవనం కుప్పకూలి ఉంటుందని జీహెచ్ఎంసీ, పోలీసువర్గాలు చెబుతున్నాయి.


భవనం పైభాగంలో బట్టీలను నిర్మించవద్దని వాటి నిర్మాణం సందర్భంగానే హోటల్లోని కొంతమంది సిబ్బంది యజమానిని వారించినట్లు చెబుతున్నారు. అయినా, పెడచెవిన పెట్టినట్లు సమాచారం. ఆదివారం రాత్రి నుంచే పెచ్చులు ఊడుతున్నా కూడా యాజమాన్యం గమనించలేదు. భవనానికి పిల్లర్లు కూడా లేకపోవడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. సిటీలైట్ హోటల్ కూలి 13 మంది మరణించిన విషయం తెలిసిందే.