బోన‌మెత్తిన భాగ్యన‌గ‌రం

 

సికింద్రాబాద్ బోనాల సంద‌ర్భంగా భాగ్యన‌గ‌రం కొత్త శోభ సంత‌రించుకుంది.. ఆషాడం జాత‌ర‌గా పేరొందిన ఉజ్జయినీ మ‌హంకాళి అమ్మవారి భోనాలు ఆదివారం ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు మహా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిచ్చారు. తెలంగాణాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.

రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ ఉత్సవాల్లో తొలి రోజు భ‌క్తులు అమ్మవారికి భోనాల‌తో పాటుర సాక స‌మ‌ర్పిస్తారు.. రెండో రోజ‌యిన సోమ‌వారంనాడు రంగం నిర్వహిస్తారు.. అవివాహిత మ‌హిళ చెప్పే భ‌విష్యవాణి విన‌టానికి ఎంతో ప్రత్యేక‌త ఉంది. రంగంలో భాగంగా దేశ ప‌రిస్థితులు, వ‌ర్షాలు ఇలా అనేక విష‌యాల‌ను అమ్మవారే చెపుతార‌ని న‌మ్ముతారు భ‌క్తులు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరతో పాటు సికింద్రాబాద్‌లోని 40 దేవాలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరుతున్నాయి.ఈ రోజు ఉద‌యం నుంచి సికింద్రాబాద్ అమ్మవారి ఆళ‌యానికి విఐపిల తాకిడి కూడా బాగా ఉంది.. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌, రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైకాప అధ్యక్షులరాలు విజ‌య‌మ్మ, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇంకా చాలా మంది నాయ‌కులు నాయ‌కులు అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.