పంచాయితీ రెండో తీర్పూ అదే

 

రెండో దశ పంచాయితీ ఎలక్షన్స్ లోనూ తొలి దశ ఫలితాలే రిపీట్ అయ్యాయి.. ప్రదాన పోటి అంత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి పార్టీల మధ్యే సాగింది.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో అయినా పరువు నిలబెట్టుకుంటే.. టిఆర్ ఎస్ మాత్రం పూర్తిగా చతికిల పడింది.. ఒక్క కరీంనగర్ జిల్లాలో తప్ప మిగతా అన్ని చోట్ల టిఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయింది.

తెలంగాణ తో పాటు అన్నిప్రాంతాల్లోనూ టిడిపి హావా కొనసాగగా, కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి దశతోపోలిస్తే రెండో దశలో బాగానే పుంజుకున్నటుగా కనిపిస్తుంది. వైయస్ ఆర్ కాంగ్రెస్, టిఆర్ ఎస్ పార్టీలు మాత్రం మొదటి దశ కన్నా ఈ దశలో మరింత వెనకపడ్డాయి.. టిఆర్ఎస్ పార్టీ కేవలం కరీంనగర్ జిల్లాలో తప్ప మరెక్కడ ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న 1903 అభ్యర్ధులు గెలుపొందగా, టిడిపి మద్దతిస్తున్న 1809, వైకాపా పార్టీ తరుపున 1065, టిఆర్ పార్టీ నుంచి 545 మంది అభ్యర్ధులు గెలుపొందారు..