యూసుఫ్‌గూడ ఏటీఎం దొంగ అరెస్టు

 

హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఎస్‌బీఐ ఏటీఎంలో కాల్పులకు పాల్పడి, ఒక యువతిని బెదిరించి ఆమె దగ్గరున్న ఏటీఎం కార్డు, ఆమె దగ్గరున్న నగలను తీసుకుని వెళ్ళిపోయిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఏటీఎం కార్డు నుంచి ఆ దుండగుడు 3,500 నగదును విత్ డ్రా చేశాడు. పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేసి, అతని దగ్గర నుంచి తుపాకీ, మూడు తూటాలను స్వాధీనం చేసుకున్నారు.