ఉగ్రవాదులు నన్ను లేపేస్తారేమో: సంజయ్ దత్త్

Publish Date:May 14, 2013

 

ఈ రోజు సుప్రీంకోర్టు బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు మరింత సమయం బయట ఉండేందుకు నిరాకరించడంతో, ఆయన వెంటనే టాడా కోర్టులో ఒక పిటిషను వేసారు. తనకు ముంబైలోని ప్రత్యేక కోర్టు వద్ద ఉగ్రవాదుల నుండి ప్రాణహాని ఉన్నందున తనకు పూణే జైలులో లొంగిపోయేందుకు పూణేలోని ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఈయాలని ఆయన తన పిటిషనులో కోర్టుకు విజ్ఞప్తి చేసారు. గతంలో ఆయన అండర్ వరల్డ్ నేరస్తులతో సంబంధాలు కలిగి ఉండటంతో, 1993లో ముంబైపై ఉగ్రవాదుల దాడుల కేసుల్లో వారి నుండి అక్రమాయుధాలు సంపాదించారు. అందువల్ల ఇప్పుడు వారి నుండి తనకు ప్రాణ హాని ఉంటుందని సంజయ్ దత్త్ భయపడుతున్నారు.

 

గతంలో పోలీసులు తనను పూణే జైలుకి తరలిస్తున్నపుడు ముంబై నుండి పూణే వరకు దాదాపు 125కి.మీ. మీడియావారు వ్యానులలో వెంబడించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చి, ఈసారి వారు తనని వెంబడించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు. కోర్టు ఆయన పిటిషనుపై విచారణను రేపటికి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో సంజయ్ దత్త్ వేసుకొన్న రివ్యు పిటిషన్ను కోర్టు తిరస్కరించిన తరువాత ఆయనని ఈ నెల 16వ తేదీలోగా ప్రత్యేక కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఇక, ఆయనకి మూడున్నర ఏళ్ళు జైలులో గడపక తప్పదని రూడీ అయిపోయినట్లే.