జేమ్స్‌బాండ్ అంబాసిడర్ సానియా

 

టెన్నిస్ స్టార్, తెలంగాణ అంబాసిడర్ సానియా మీర్జాకి ఒక జేమ్స్‌బాండ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని సానియా మీర్జా స్వయంగానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తనకు అందరి ఆశీస్సులు కావాలని, అందుకే తాను ఈ విషయాన్ని నలుగురికీ బహిర్గతం చేస్తున్నానని సానియా మిర్జా ట్విట్టర్లో పేర్కొంది. గతంలో కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఓ పాటలో నర్తించింది.