"సమరదీక్ష"వద్ద టి ఉద్యోగుల అత్యవసర భేటి

 

 

samaradeeksha, telangana issue, Telangana deeksha, KCR Samaradeeksha

 

 

ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న సమరదీక్ష వేదిక వద్ద తెలంగాణ ఉద్యోగులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆదివారం ఆజాద్, షిండేల వ్యాఖ్యల అనంతరం నెలకొన్న పరిస్థితులపై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. 100 రోజుల సమ్మెను చెప్పట్టే దిశగా ఉద్యోగులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తేలికగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని మరుగున పడేస్తుందని, అందుకే ఈ సమయంలోనే కేంద్రం మీద వత్తిడి పెంచేలా కార్యాచరణ ఉండాలని భావిస్తున్నారు. ఇంతకుముందే 100 రోజుల సమ్మెకు అనుకూలంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులను సంసిద్దం చేశారు. ఇప్పుడు మరింత నాన్చివేత ధోరణి నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.