అన్నసభ పెడితే మ్మమ్మమ్మ...మాస్...


సత్తి: అన్నకి బెయిలొస్తే మాస్..అన్న దీక్షేస్తే మాస్..మ్మమ్మమ్మ...మాస్... అవున్రా…నాయుడో.. అదేదో సమేకమట...దానికోసం రోడ్డు మీద కూకుంటే ఆ తెలంగానోళ్ళు మీదపడి కలబడతారేమోనని, పాపం మన అన్న ఇంటి కాడే సిన్న టెంట్ ఏసుకొని ఐదు రోజులు ముద్ద కూడా ముట్టకుండా పాపం పెనాల మీదకు తెచ్చుకొన్నాడు రా? కానీ, ఆ డిల్లీ వోళ్ళు సమేకం మాత్రం ఇవ్వనేదట్రా... ఆసుపత్రిలో కుదేసి బలవంతంగా సూది మందు ఎక్కించేసి, ఇక ఈ నాటకాలు సాలించి ఇంటికెల్లి బువ్వ తిని తొంగో..అని ఆసుపత్రి నుండి గెంటేసినారట. ఎంతన్నాయం...ఎంతన్నాయం.


నాయుడు: ఒరేయ్ సత్తిగా! నాకోటి తెలవక ఆడుతున్నాగానీ, మొన్నటి దాక అన్న జైల్లో సల్లగా కూకోని బిర్యానీలు తినుకొంటూ, కూల్ డ్రింకులు పీల్సుకొంటూ ఊసలు నెక్కెట్టుకొన్నాడా? అప్పుడు పాపం ఆ ఆడకూతురు, ఆల్లమ్మ ఇద్దరూ ఎండనక, వాననక ఆ తెలంగాణంలో పడి తిరిగి తిరిగి “మా అన్నొస్తాడు...నా కొడుకొస్తాడు మిమ్మల్ని ఉద్దరిత్తాడు...”అని అక్కడి జనాల సెవులు సిల్లులు పొడిసినారా? మరేట్రా మనోడిప్పుడు.. ఉన్నపాలిగా ఆళ్ళకి హ్యాండిచ్చేసి మన పక్క జంపయిపోయి... జైలు నుండి రావడం రావడంతోనే సమేకం అని ఓ! ఒకటే... దీచ్చలు, సభలు సేసేతున్నాడు? అసలు ఈన్నిమనం నమ్మోచ్చంటావా?

 

సత్తి: ఒరే! అన్ననే అనుమానిత్తావురా? కళ్ళు పేలిపోతాయిరా..లెంపలేసుకో..మన అన్నేమి రేతిరికి రేతిరి జంపయిపోనేదురా సచ్చినోడా? అసలు అన్ననోట ఎప్పుడయినా తెలంగాణం ఇస్తామని పలికినట్లు నీకు గురతుందిరా నీకు? అక్కడి జనాలను బాధపెడితే మానకేటోస్తదని ఏదో ‘గవురిస్తాం’ అన్నాడు అంతే. అదట్టుకొని అన్న మడమ తిప్పేసి, తెలంగాణం నుండి జంపయిపోనాడాని నీబోటోళ్ళు కూడా అనేస్తే నాకు మా సెడ్డ బాధగా ఉందిరోరే.

 

నాయుడు: నిజమేననుకో...కానీ ఆల్లు మనకొద్దని అనేసుకొని ఆడి నుండి సల్లగా బయటడిపోనాక, మళ్ళీ జనాలని పోగేసుకొని, ఆల్లకి టిపినీలు..కాపీలు..బిర్యాని పొట్లాలు ఇచ్చుకొంటూ ఈ సమేకం దీచ్చలు ఎందుకంటా? అదేదో మనకాడే జెండా ఒట్టుకొని తిరిగితే మామేటి ఒద్దన్నమేటి? అన్న దీచ్చకి జనాలు మొకం సూపనేదంటే మనకి ఎంత నామోసీగా ఉంటాదో నీకేరుక నేదేటి? అందుకే నాను బాధ పడుతున్నా..అయినా ఆ ఇంటి గుమ్మo కాడ కూకోని దీచ్చలు సేసే బదులు, అదేదో లంకంత ఇంట్లో ఎంచక్కా ఐసు పెట్టె ఏసుకొని సేసుకోవచ్చు కదా అని నేనడుగుతున్నా?

 

సత్తి: ఒరేయ్ నాయుడు... నీ కున్నపాటి తెలివి తేటలు మన అన్నకి నేవనుకున్నవురా ఎర్రిమోకమా?   కొంచెం సీకటయ్యాక, రేతిరి పూట ఇంట్లోనే తొంగోనొస్తున్నాడని ఆ పేపరోల్లు రాసింది సదవ నేదురా? తెలివి తక్కువ నాయాలా?

 

నాయుడు: అవున్రా..గానీ ఏమాటకామాటే సెప్పుకోవాల్రోరేయ్... ఇంట్లో తొంగోనొచ్చినా లోనకెళ్ళి ముద్ద మాత్రం ముట్టనేదురా మన అన్న. అది మాత్రం నేను గేరంటీగా సెప్పగలను...అన్న మాటంటే మాటేరా? గానీ మనకి మడమ తిప్పొదని గట్టిగా సెప్పి ఆయన మాత్రం మాటిమాటికి మడమ తిప్పుతున్నాడేట్రా? దీనినిమాత్రం నువ్వు కాదంటే నాను ఒప్పుకోను..స్మీ!

 

సత్తి: నాకు తెలీకుండా అన్నమడమ ఎప్పుడు తిప్పినాడురా? తెలంగానోల్లని ‘గవురిస్తాం’ అన్నాడు.ఇప్పుడు అదే మాట మీదున్నాడు. సమేకం అంటే సమేకం కాదు... కావల్నంటే మీ కోసరం కూడా కొట్లాడతా అన్నాడా? అట్టాగే సమేకం కోసమయితే నేటి, మరిదేని కోసరమయితేనేటి గానీ ఉద్దెమాలు సేత్తున్నాడా? “నీ ఊరు కోస్తా.. నీ పేట కోస్తా..నీ... ఈది కోస్తా..నీ ఇంటి కోస్తా... అక్కడే సమేకం సభ ఎడతా..’ అని నందమూరోళ్ళ మాదిరి తొడగొట్టి సభ ఎడుతున్నాడా? లేదా?ఇంకేటి కావల నీకు?


నాయుడు: గానీ మనోడు ఎంత దువ్వినా ఆ గవుర్నుమెంటోల్లని మాత్రం మనకేసి లాగనేకపోనాడురా? అప్పటికీ మన అమ్మోగోరు ఆల్లకి పనిసేయకపోయినా జీతాలు, పండుగ డబ్బులు గట్రా ఇత్తానని సెప్పి సూసిందిరా..గానీ అల్లు అమ్మ మాటింటే కదా...అందరూ పొలోమని ఆ ముక్కెమంత్రి ఏమందు సేల్లాడో ఏటో బెల్లం సుట్టూ ఈగల్లాగా ఆయన సుట్టూ ముసురుకొన్నారు తప్ప, ఒక్కడూ మనోడ్ని పట్టించుకొన్నపాపాన్న పోనేదురా.. నాకు మా సెడ్డ బాధగా ఉందిరొరే సత్తిగా...

 

సత్తి: అదేటి అమ్మగోరు అన్ని లచ్చల మందికి జీతాలు, పండగ డబ్బులు ఇచ్చేస్తే అమ్మగారికిక ఆస్తేటి మిగులుద్ది. ఆనక మన అన్నకు ఆ ఆడకూతురికి ఏటిస్తాదేటి అమ్మ? అయినా అన్ని లచ్చల మందికి పంచేంత డబ్బు డబ్బు అమ్మగారికాడ ఉందంటే నమ్మమంటావారొరే?

 

నాయుడు: స్సీ..స్సీ... బుద్ది లేనోడా...జీతాలు బత్తేలు ఎవులన్నాజేబులోంచి తీసి ఇస్తారురా? అయినా నిజంగా అమ్మగారు ఇవ్వాలనుకొంటే ఆల్లకి అదొక నెక్కకాదనుకో...గానీ అన్న ముక్కెమంత్రి అయినాక ఇస్తామని సేప్పినారురా ఆమ్మగోరు.

 

సత్తి: ఆ... ఆలా సెప్పు మరి. అంటే అల్లకి జీతాలు బత్తేలు కావాలంటే ముందు ఆ గవుర్నుమెంటోలందరూ మన అన్నకి ఓటేసి ముక్కేమంత్రిని సేసీయలన్న మాట! ఒరే..అన్న మనమనుకొన్నంత అమాయకుడేమి కాదురోరేయ్..మా సెడ్డ కంత్రీ బుర్రరో మనోడిది...

 

నాయుడు: సెత్! అట్లా అనమాకురా ఎవులయినా ఇంటే నవ్విపోతారు. అన్న మా సెడ్డ తెలివయినోడనాలి...తప్ప కంత్రీవోడు, ఊసరవెల్లి అనమాకురొరే..అన్నకి తెలిస్తే నీ సెమడా ఒలిపించీ గలడు.         

 

సత్తి: అద్సరే గాన్రోరే నాయుడూ..మనమేమో అన్న జైలు నుండి బయటకోచ్చేస్తే ఇక అంతా మ్మమ్మమ్మ...మాస్...అని ఓ మందు కొట్టి సిందులేసీసామా... కోరుటు అనుమతియ్యాలే కానీ ‘బస్తీ మే సవాల్’ అని తొడగొట్టి అయిదరాబాదులోనే సమేకం సబెట్టుకొంటామని సాలేంజి కూడా సేసేసినామా? తీరాసేసి ఇప్పుడు కోరుటోళ్ళు పర్మిసను కూడా ఇచ్చీనాక జనాలని పోగేసుకోడానికి మాకు టైం సరిపోదు, మాకాడ జనాలు నేరు.. ఆ గవుర్నుమెంటోళ్ళు మోకాలు చాటేసారు...అని సేప్పుకోవడం మా సెడ్డ నామోషీగా ఉందిరొరే...


నాయుడు : నిజమే...గానేటి సేత్తాం సెప్పు మనోడికి దూకుడెక్కువ...ఓ పాలి రాజీనామాలు సేసేయండి అంటాడు..మరో పాలి...అందరూ సాటుగా బిర్యానీలు తినుకొంటూ అయినా సరే, అదేటది...సచ్చేదాకా సత్తేగ్రహాలు సేసేయమంటాడు...’గవుర్నరు మనోడే.. నానెల్లి సెపితే ఇనక సస్తాడా?’ అని మనోల్లని ఎంటేసుకొని ఎల్లి ‘ఎంటనే శాసనసభ ఎట్టేస్తే నానే సమేకం తీరుమానం సేసేసి నానే బరబరామని సంతకం గీకేసి ఆ డిల్లీ ఓల్లకి పంపీగలను’ అని ఓ ఒకటే ఊదరగొట్టేసాడు. గానీ ఎవురయినా మనోడి మాట ఇంటే గదా అసలు? మనోడు ఎప్పుడు ఓ ఊరకే రెచ్చిపోయి ఆయాసపడిపోడమే గానీ, పనయినాదేటి ఎప్పుడయినా? అసలు మనోడికి మనమే ఇంకా బాగా ట్రైనింగు ఇచ్చుకోవలేమోరా?       

 

సత్తి: అవున్రా కనీసం ఇప్పుడు ‘సమేకం సభ ఎట్టుకొండిరా...’అని కోరుటోళ్ళు సెప్పినా కూడా సభ ఎట్టుకోలేని  పరిస్థితి చూస్తే, అన్నకెలా ఉందో తెలవదు కానీ, నాకు మాత్రం తల కొట్టేసినట్లుందిరోరే. నానే అన్న కుర్సీలో కూకోని ఉంటే, నాకాడే అన్న లెక్కన డబ్బు మూటలు ఉంటేనా... నేను రేతిరికి రేతిరే మన కూలోల్లని అందరికీ తలో వెయ్యి ముఖాన కొట్టి వెయ్యి లారీలతో అయిదరాబాదులో సభ ఎట్టి మన తడాకా సూపేటోడిని.

 

నాయుడు : ఓస్..ఓసోస్...మొన్నపంచాయితీ ఎలచ్చన్లలో పట్టుమని పది మందిని కూడా పోగేయనేక పోనావు గానీ ఇప్పుడు ఎయ్యి లారీలలో జనాలని ..అది కూడా అయిదరాబాదుకి తోలుకెలిపోతావా? నాకు తెలవక అడుగుతున్నాను రా ఒరే...సత్తిగా.. అసలు నీ జన్మలో ఎప్పుడయినా అయిదరాబాదు మొకం సూసేవురా? అసలు ఆయిదరాబాదుకు దారెటో తెలుసురా నీకు? అయిదరాబాదులో మనూరుంత ఇల్లు కట్టుకొని, సేతిలో డబ్బు సంచులు ఒట్టుకొని, నీ లాంటి గొట్టంగాళ్ళని వంద మందిని వెనకేసుకొని తిరుగుతున్న మన అన్నేఏటీ సెయ్యనేక సేతులు పిసుకొంటుంటే, బేరాలేక ఈ డొక్కు రిచ్చాలో కాలు మీద కాలేసుకొని కూకోని బీడీలు కాల్సుకొంటూ అయిదరాబాదులో సభ ఎట్టేస్తాడట...దానికి ఈడ నుండి జనాలని తోలేస్తాడట....హ హా...హా..

 

సత్తి: నవ్వరా నవ్వు... ఏదో ఒకరోజు అన్నసభ ఎట్టకపోతాడా.. నాను ఎల్లకపోతానా? అప్పుడు సూద్దువుగాని..నా...పవరేటో..

 

నాయుడు : ఒరే సత్తిగా..మనకీ నారీలు, బస్సులు లెందుగ్గానీ, అన్న కబురంపితే నువ్వు నీ డొక్కు రిచ్చాలో నాను నా డొక్కు రిచ్చాలలో మన ఆడోల్లని, పిల్ల పాపని ఏసుకొని ఆయిదరాబాదుకి ఎల్తే ఎట్టుటుందంటావు రా...?    

 

హా...హా... హా.. అప్పుడుగానీ మనకి బుద్ది రాదురొరే