సల్మాన్ ఖాన్ కు సుప్రీం నోటీసులు..

 

సల్మాన్ ఖాన్ ను పాపం  వన్యప్రాణులను వేటాడిన కేసు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. 1998లో రెండు ఘటనల్లో వన్యప్రాణులను వేటాడిన కేసుల్లో రాజస్థాన్‌ హైకోర్టు ఈ ఏడాది జులైలో సల్మాన్‌ఖాన్‌ నిర్దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు మాత్రం సల్మాన్ ను వదలనట్టే కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం సల్మాన్‌ఖాన్‌కు నోటీసులు పంపించింది. కాగా కృష్ణజింకలను వేటాడిన మరో కేసులో కూడా సల్మాన్‌పై విచారణ జరుగుతోంది.