పావలాకు కూడా చెల్లని పవన్ కల్యాణ్

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే.అనంతరం కవాతు సందర్భంగా ఏర్పాటు చేసిన భహిరంగ సభలో టీడీపీ టీడీపీ, బీజేపీ, వైసీపీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిలపై తీవ్ర స్థాయిలో పవన్ ధ్వజమెత్తారు.పవన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు విమర్శలు గుప్పించారు.కానీ తాజాగా టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ పవన్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదని, పావలాకు కూడా చెల్లని పవన్ కల్యాణ్  రెండువేల రూపాయిల నోటువంటి లోకేశ్‌బాబు గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని యామినీ విమర్శించారు.అంతేకాకుండా గాంధేయవాదిని అని చెప్పుకునే పవన్ తాట తీస్తా,తోలు తీస్తా అంటున్నారు,మీరు ఎవరి తాట తీయగలరు? కూర్చొని మల్లెపూల పూలని మాత్రమే నలపగలరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.యామిని వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు, పవన్ వీరాభిమానిగా చెప్పుకునే మాధవీ లత ఫేస్‌బుక్ వేదికగా స్పందించారు.

 

 

" ఇన్నాళ్లు పోనీలే అని ఊరుకున్నా.. ఇప్పుడు నాకు కాలింది.  మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో..? చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం..? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా..? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా తెలియదులేమ్మా..! కవాతు దేనికోసమా....? ఏం చేశాడనా....? ఏం చేయలేదు అమ్మా ఏదో మీరు చేయలేనివి ఆయన చేసేద్దామనే తపన అంతే. ప్రజలకోసం వద్దు.. ఆయన పర్సనల్ లైఫ్ మీద పడి ఏడవటమే ఎందుకంటే మీకు పీకడానికి, చెప్పడానికి వేరే కంప్లైంట్స్ లేవు కదా....?
మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడు.. నిన్నేమో ఎవడో డబ్బులు ఖర్చుపెట్టాడు.. మీ అయ్యలు ఇచ్చారా..? మీ తాతలు ఇచ్చారా..? ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు..? పైసల్ ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా....? ఉంటదిలే కడుపులో మంట. ‘ఈఎన్ఓ’ అని ఎప్పుట్నుంచో ఉంది అది తాగితే తగ్గుద్దేమో మరి. పనిచేయకపోతే అపోజిషన్ అనేది ప్రశ్నించాలి కానీ అసలు మొదలెట్టకుండా ఆపడం కాదు.. ఇకనైనా నేర్చుకొండి" అని ఫేస్‌బుక్‌లో యామినీకి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.మరి ఈ వ్యాఖ్యల దూమారం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే..!!